ETV Bharat / state

కేటీఆర్​ పీఏ పేరుతో రంజీ మాజీ క్రికెటర్​ మోసం.. అరెస్ట్​

author img

By

Published : Feb 15, 2020, 6:59 PM IST

మంత్రి కేటీఆర్​ పీఏ పేరుతో మోసగిస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. నాగరాజు అనే రంజీ మాజీ క్రికెటర్​... కేటీఆర్​ మంత్రి పీఏ తిరుపతి రెడ్డి అని చెప్పుకుని ఓ కంపెనీ సీఎండీని మోసం చేసినట్లు సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ తెలిపారు.

Minister KTR PA
కేటీఆర్​ పీఏ పేరుతో మోసం

శ్రీకాకుళం జిల్లాకు చెందిన రంజీ మాజీ ఆటగాడు నాగరాజు... కేటీఆర్ పీఏ తిరుపతి రెడ్డిగా చెప్పుకుంటూ... అతని మొబైల్ నంబర్​ను ట్రూ కాలర్​లో కేటీఆర్ పీఏ తిరుపతిగా మార్చుకొని... గత ఏడాది ఓ కంపెనీ సీఎండీకి ఫోన్ చేశాడు.

తనను తాను కేటీఆర్ పీఏగా పరిచయం చేసుకుని.. బ్రిటన్​లో జరగనున్న టీమ్ ఇండియా అండర్-25 క్రికెట్ వరల్డ్​ కప్​కు నాగరాజు అనే నిరుపేద ఆటగాడు సెలెక్ట్ అయ్యాడంటూ తెలిపాడు. అతనికి క్రికెట్ కిట్ కోసం రూ.3 లక్షల 40 వేలు స్పాన్సర్ చేస్తే... ఆ కిట్ల పై మీ కంపెనీ లోగో ఉంటుందని, పబ్లిసిటీ వస్తుందని నమ్మబలికాడు.

ట్రూ కాలర్​లో ఫోన్ నంబర్ కేటీఆర్ పీఏ అని రావడం వల్ల సదరు కంపెనీ సీఎండీ అతడు ఇచ్చిన అకౌంట్​లోకి రూ.3 లక్షల 40 వేలు ట్రాన్స్ ఫర్ చేశారు. కొన్నిరోజులకు మరోసారి సీఎండీకి ఫోన్ చేసి కేటీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలిపాడు. తాను పీఏ అయినందు వల్ల ముందే సమాచారం వచ్చిందని... ఫిబ్రవరిలో ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఈ కార్యక్రమానికి మీ కంపెనీకి స్పాన్సర్ ఇప్పిస్తానని తెలిపాడు.

అందుకు గాను అతని స్నేహితుడు రాజమండ్రిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని... అతని చికిత్స నిమిత్తం రూ.2 లక్షలు పంపాలంటూ కోరాడు. మరోసారి డబ్బులు అడగడం వల్ల అనుమానం వచ్చిన సీఎండీ.. నాగరాజు అనే క్రికెటర్ గురించి గూగుల్​లో సెర్చ్ చేశాడు. నాగరాజుపై గతంలో పలు చీటింగ్ కేసులు నమోదయ్యాయని తెలిసింది.

గత ఏడాది డిసెంబర్​లో సైబర్ క్రైమ్​లో ఆ సంస్థ క్లర్క్ ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు నాగరాజు మొబైల్ నంబర్ ఆధారంగా విశాఖపట్నంలో శుక్రవారం అరెస్ట్ చేశారు. శనివారం అతన్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్​కు తరలించినట్లు సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్​ తెలిపారు.

కేటీఆర్​ పీఏ పేరుతో మోసం

ఇదీ చూడండి: ప్లాస్టిక్​ నిషేధంపై రామవరప్పాడులో కలెక్టర్​ అవగాహన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.