ETV Bharat / state

'ఫోటో ఛాలెంజ్... వర్క్ ​ఫ్రం హోంలపైనే వారి దృష్టి'

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల వినియోగం పెరిగింది. దీన్ని ఆసరాగా తీసుకొని సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇంటిల్లిపాదీ ఈ నేరగాళ్ల బారిన పడుతున్నారు. వీరు ఆర్థికంగా దోచుకోవడమే కాకుండా... వ్యక్తిగత సంబంధాలను సైతం చిన్నాభిన్నం చేస్తున్నారు.

cyber-crime-cases-increase-in-lockdown-time
'ఫోటో ఛాలెంజ్... వర్క్ ​ఫ్రం హోంలపైనే వారి దృష్టి'
author img

By

Published : Apr 14, 2020, 7:29 AM IST

  • వర్క్‌ఫ్రం హోంలో భాగంగా ఇంటి నుంచే పనిచేసుకుంటున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి... కొవిడ్‌-19 సమాచారం పేరుతో తనకొచ్చిన ఈ-మెయిల్‌ను చూశారు. కాని దాని మాటున తన ల్యాప్‌టాప్‌లో మాల్‌వేర్‌ చొరబడిందన్న విషయం తెలుసుకోలేకపోయారు. అప్పటి నుంచి ఆ ల్యాప్‌టాప్‌ ద్వారా ఆ సాఫ్ట్‌వేర్‌ సంస్థకు చెందిన లావాదేవీలపై సైబర్‌ నేరగాళ్లు కన్నేసి... డబ్బు గుంజడం మొదలుపెట్టారు.
  • ఆన్‌లైన్‌ తరగతుల్లో భాగంగా 8వ తరగతి విద్యార్థి తన కంప్యూటర్‌ తెరవగానే అది స్తంభించిపోయింది. తెరపై డబ్బు చెల్లిస్తేనే మళ్లీ తెరుచుకుంటుందనే సందేశం ప్రత్యక్షమైంది. అప్పుడు కాని ఆమెకు తెలియలేదు అది ‘ర్యాన్‌సం వేర్‌’ అని.

శారీ ఛాలెంజ్ నుంచి వివాహ వేదిక వరకు...

కాలక్షేపంగా ఉంటుందని ‘శారీ ఛాలెంజ్‌’ పేరుతో మహిళలు మంచి చీర ధరించి ఆ చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. వీటిని సైబర్‌ నేరగాళ్లు వివాహ పరిచయ వేదిక వెబ్‌సైట్లలో వాడుకోవడమే కాకుండా... సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ఖాతాలు తెరిచి స్నేహం చేద్దామంటూ వలవేస్తున్నారు. ఈ ఫొటోలను అశ్లీల వెబ్‌సైట్లలోనూ పెడుతున్నారని సైబర్‌ నిపుణులు చెబుతున్నారు.

లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఫేస్‌బుక్‌లో మహిళల నుంచి వస్తున్న ఫ్రెండ్‌ రిక్వెస్టులు 12 శాతం పెరిగాయని సైబర్‌ నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో సింహభాగం తప్పుడు ఖాతాలేనని వారు వెల్లడిస్తున్నారు. శారీ ఛాలెంజ్‌ తరహాలోనే ఇప్పుడు ఫ్యామిలీ ఛాలెంజ్‌ కూడా ప్రాచుర్యం పొందింది... దీనిలో భాగంగా భార్యాభర్తలు కలిసి ఫొటో దిగి సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. దీన్ని కూడా తస్కరిస్తున్న సైబర్‌ నేరగాళ్లు భర్త ఫొటోను తొలగించి ఆ స్థానంలో మరొకరి ఫొటో ఉంచి మార్పులు చేసి... తిరిగి ఆన్‌లైన్​లో పెడుతున్నారు. తద్వారా సదరు మహిళ మరొకరితో సన్నిహితంగా ఉంటుందనే అభిప్రాయాన్ని కల్పించి బెదిరింపులకు దిగుతున్నారు.

వర్క్‌ ఫ్రం హోంతో జాగ్రత్త

ఇంటి నుంచే పనిచేస్తున్న వారు వైఫై పైన ఆధారపడుతున్నారు. కేవలం కొన్ని సంస్థలు మాత్రమే సురక్షితమైన ‘వర్చువల్‌ నెట్‌వర్క్‌ సెక్యూరిటీ’ (వి.ఎన్‌.ఎస్‌.) ద్వారా పని చేయించుకుంటున్నాయి. వైఫైలో ఉన్న బలహీనతల కారణంగా సైబర్‌ నేరగాళ్లు సులభంగా నెట్‌వర్క్‌లోకి చొరబడుతున్నారు. సదరు ఉద్యోగుల ల్యాప్‌టాప్‌ల నుంచి వారు పనిచేస్తున్న సంస్థ నిర్వహిస్తున్న లావాదేవీలు, సంస్థ క్లెయింట్‌ల సమాచారాన్ని కూడా చోరీ చేస్తున్నారు.

సమాచారం పేరుతో టోకరా

కరోనా సమాచారం పేరుతో అనేక అటాచ్‌మెంట్లు వస్తున్నాయి. వీటిని ఫొన్లోనో, కంప్యూటర్లోనో తెరిస్తే డాక్యుమెంట్‌ తెరవగానే సదరు ఉపకరణం ర్యాన్‌సమ్‌వేర్‌ బారిన పడుతుంది. సైబర్‌ నేరగాళ్లు అడిగినంత చెల్లిస్తేనే మళ్లీ అది తెరుచుకుంటుంది. లేదంటే ఈ అటాచ్‌మెంట్‌ వెనుక కీలాగర్‌ సాఫ్ట్‌వేర్‌ ఉంటుంది. ఇది దిగుమతి అయిన తర్వాత సదరు ఫోన్‌, కంప్యూటర్లో టైప్‌ చేసే ప్రతి అక్షరం సైబర్‌ నేరగాడికి చేరిపోతుంది. తద్వారా పిన్‌నెంబర్‌తో సహా బ్యాంకు లావాదేవీలన్నీ నేరగాడికి తెలిసిపోతుంటాయి.

జాగ్రత్తే శ్రీరామరక్ష

కరోనాను అడ్డంపెట్టుకొని సైబర్‌ నేరగాళ్లు... ఫొటోలు మొదలు వ్యక్తిగత సమాచారం ఏది దొరికినా తెలివిగా వాడుకుంటున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మన వ్యక్తిగత సమాచారం సామాజిక మాధ్యమాల్లో పెట్టకూడదు. ఈ విషయంలో మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాలి. నమ్మకం లేని సంస్థల నుంచి వచ్చే వీడియో గేమ్స్‌, యాప్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్‌ చేసుకోవద్దు. సంబంధం లేని విద్యాసంస్థల నుంచి వచ్చే పాఠాలను కూడా పిల్లలు తెరవకూడదు. ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల్లో ఎప్పటికప్పుడు తాజా యాంటీ వైరస్‌ లోడ్‌ చేసుకోవాలి. ఆపరేటింగ్‌ సిస్టంను అప్‌డేట్‌ చేసుకుంటుండాలి. బ్యాంకు ఖాతా వివరాలు, పిన్‌నెంబర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ చెప్పవద్దంటు నిపుణులు సలహాలు ఇస్తున్నారు.

ఇవీ చూడండి: మామకు కరోనా పాజిటివ్... అల్లుడిపై కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.