Cyber Crime Cases in Hyderabad : సైబర్ మాయాగాళ్ల(Cyber Crimes Telangana) చేతిలో మోసపోతున్న కేసులు రోజుకి కనీసం పదుల సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ మణికొండకు చెందిన యువతి బీటెక్ పూర్తి చేసి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. వాట్సాప్ ద్వారా ఆమెతో పరిచయం పెంచుకున్న షైలా అనే మహిళ తమ కంపెనీ ప్రచారం కోసం సంప్రదిస్తున్నట్లు నమ్మించింది. లైకులు కొట్టి స్క్రీన్‌షాట్లు పంపిస్తే డబ్బులిస్తామని ఆశజూపింది.
Easy Money Frauds Hyderabad : ఇదంతా నమ్మిన సదరు యువతి.. షైలా సూచించిన టెలిగ్రామ్ గ్రూపులో చేరింది. దీంతో రోజు 23 టాస్కుల చొప్పున పూర్తి చేయాలని, ఒక్కో టాస్కులో లైకులు కొట్టి స్క్రీన్‌షాట్లను గ్రూపులో పోస్టు చేయాలని సూచించింది. యువతి సెప్టెంబరు 5వ తేదీన కొన్ని టాస్కులు పూర్తి చేయగానే 200 చొప్పున మూడు సార్లు కలిపి 600 జమ చేసింది.
ఆ తర్వాత టాస్కుల కోసం ముందు డబ్బు చెల్లిస్తే లాభాలతో కలిపి ఇస్తామని వెల్లడించారు. ఇలా నాలుగు రోజుల్లో యువతి నుంచి రూ.59.2 లక్షలు జమ చేయించుకున్నారు. ఎన్ని టాస్కులు పూర్తి చేసినా మళ్లీ మళ్లీ డబ్బు పంపాలని కోరుతూ లాభాలు మాత్రం ఇవ్వలేదు. అనుమానం వచ్చిన యువతి తెలిసిన వారిని సంప్రదించగా ఇదంతా మోసమని తేలింది. అనంతరం ఆ యువతి సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
HP Franchise Cyber Fraud in Hyderabad : మరో కేసులో.. కుమారుడికి హెచ్పీ గ్యాస్ డీలర్‌షిప్(HP Gas Dealership) ఇప్పించేందుకు ఆన్‌లైన్‌లో వెతికిన తల్లి నుంచి సైబర్ నేరగాళ్లు 49 లక్షల 80 వేలు కాజేశారు. కూకట్‌పల్లికి చెందిన ఓ మహిళ ఎల్పీజీ వితర్క్ చయన్ పేరుతో ఉన్న వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసింది. సదరు గ్యాస్ కంపెనీ ప్రతినిధులమంటూ రవి శంకర్, వినయ్, అభినవ్ పాటిల్, విక్కీ దీక్షిత్, వరుణ్ గుప్తా పేర్లతో ఆమెను సంప్రదించారు. దరఖాస్తు, అనుమతి ఇతర ఛార్జీల పేరుతో రూ.49.8 లక్షలు వసూలు చేశారు. సెప్టెంబర్ 11న మిర్యాలగూడలోని డీలర్‌షిప్ కేంద్రాన్ని సందర్శిస్తామని చెప్పి నకిలీ అనుమతి పత్రాలు, ఇన్‌వాయిస్‌లు పంపారు.
Customer care Fraud Hyderabad : ఛాన్స్ దొరికితే చాలు.. లూటీ చేసేస్తున్నారు
Cyber Crime Criminals Latest Plans : తమ ప్రాంతాన్ని సందర్శించకపోగా వివిధ అనుమతుల పేరుతో మరిన్ని డబ్బులు అడగటంతో అనుమానం వచ్చిన మహిళ కుమారుడికి విషయం చెప్పింది. ఆరా తీయగా అంతా బూటకమని తెలియటంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరాలపై పోలీసుల నిఘా పెరగటంతో నిందితులు పంథా మార్చుకుని కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. అంతర్జాలంలో వచ్చే ప్రకటనల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Man Blackmailed Girl at jawaharnagar : 'ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే.. ఫొటోలు మార్ఫింగ్ చేస్తా'
Deepfake Voice Cloning : 'డీప్ ఫేక్' మోసం.. స్నేహితుడిలా మాట్లాడి రూ.30వేలకు టోకరా