ETV Bharat / state

పెళ్లి పేరుతో బురిడీ..నైజీరియన్ వలలో లేడీ..

లండన్​లో ఇంజినీర్​ను అన్నాడు. పెళ్లి చేసుకుని హైదరాబాద్ సెటిలైపోదామని ఊరించాడు. ఇంకేముందీ ఆ అమ్మాయి గాల్లో తేలిపోయింది. ఇంతలో ఫోన్ కాల్ వచ్చింది అంతే..ఆ తర్వాత ఇలా అయ్యింది.

author img

By

Published : May 14, 2020, 9:09 AM IST

CYBER
టోకరా: పెళ్లిచేసుకుని హైదరాబాద్‌లో ఉందాం..!

పెళ్లి పేరుతో ఓ యువతిని నైజీరియన్‌ మోసం చేశాడు. తాను లండన్‌కు చెందిన ఇంజినీరునని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. పరిచయమైన నెలరోజుల్లోనే నిందితుడు ఆమెకు వజ్రాలు, బంగారు బిస్కెట్లు బహుమతిగా పంపానని మాయమాటలు చెప్పాడు. ఆమె వద్ద నుంచి రూ.12.45 లక్షలు కొట్టేశాడు. అనంతరం మోసపోయానని గ్రహించిన యువతి బుధవారం సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు దర్యాప్తు చేపట్టామని సైబర్‌ క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు.

లండన్‌లో ఇంజినీర్‌నంటూ..

బోరబండలో నివాసముంటున్న ఓ యువతి కొద్దినెలల కిందట భారత్‌ మ్యాట్రిమొనీలో నమోదు చేసుకుంది. గత నెల 2న ఆమె వ్యక్తిగత వివరాలు పరిశీలించిన ఓ వ్యక్తి తాను లండన్‌లో స్థిరపడిన ఇంజినీరునని పరిచయం చేసుకున్నాడు. తన పేరు కెల్లీహేరీ అని.. ఇష్టమైతే పెళ్లి చేసుకుంటానని, పెళ్లయ్యాక హైదరాబాద్‌లో ఒక నిర్మాణ సంస్థను ఏర్పాటు చేద్దామని వివరించాడు. అప్పటి నుంచి ఇద్దరూ వాట్సాప్‌ ద్వారా మాట్లాడుకుంటున్నారు. గత నెల 12న బాధితురాలికి ఫోన్‌చేసి, పెళ్లి ఖర్చుల నిమిత్తం 85 వేల పౌండ్లు(భారత కరెన్సీలో రూ.61 లక్షలు), వజ్రాలు, బంగారు బిస్కెట్లు పంపుతున్నానంటూ చెప్పాడు. ఆ తర్వాత కొద్దిగంటలకే దిల్లీ విమానాశ్రయం కస్టమ్స్‌ అధికారులమంటూ ఆ యువతికి ఓ వ్యక్తి ఫోన్‌ చేసి, మీ కానుకలు వచ్చాయని, ముందుగా రూ.28 వేలు చెల్లించాలని చెప్పగా.. ఆమె అలాగే చేసింది. అలా వివిధ రుసుముల పేరుతో 10 రోజుల వ్యవధిలో రూ.12.45 లక్షల నగదు బదిలీ చేయించుకున్నాడు. బహుమతులు రాకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

ఇదీ చదవండి: 'మిగులు జలాల వినియోగంపై పూర్తి వివరాలు సమర్పించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.