హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ ఫేస్‌బుక్‌కు వచ్చిన ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేసింది. యూకేలో డాక్టర్ని అంటూ అవతలి వ్యక్తి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. వాట్సాప్‌లో చాటింగ్ చేస్తూ ప్రేమను వ్యక్త పరిచాడు. త్వరలోనే మీకు ఖరీదైన బహుమతి పంపిస్తానని ఆమెకు మెసేజ్ పెట్టాడు.
కొద్ది రోజుల క్రితం బహుమతి పంపించానని అతను సందేశం పంపాడు. అనంతరం దిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి కస్టమ్స్ అధికారిలాగా ఫోన్‌చేసి... మీకు ఒక పార్సిల్ వచ్చిందని... అందులో డాలర్స్ ఉన్నాయని... వాటికి టాక్స్ చెల్లించాలని ఆమెకు తెలిపాడు. నిజమే అనుకొని వారు చెప్పినట్టుగా ప్రొసెసింగ్ ఫీజు, ఇన్కమ్ టాక్స్ వంటి వివిధ టాక్స్‌ల పేరుతో 38 లక్షల రూపాయలు... ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసింది.
అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: సేద్య సంస్కరణలతో అన్నదాతకు బంధ విముక్తి