హైదరాబాద్ బాలానగర్‌కు చెందిన మహేందర్ ఓఎల్ఎక్స్లో హోండా యాక్టీవా వాహనాన్ని చూసి నచ్చిందని రిక్వెస్ట్ పెట్టాడు. అవతలి నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి.. బైక్ కావాలంటే రూ.2,500 బదిలీ చేయాలని కోరాడు. అనంతరం మరికొంత పంపాలంటూ పలు దఫాలుగా రూ.35 వేలు వసూలు చేశాడు. వాహనం తీసుకొస్తుండగా పోలీసులు అడ్డుకున్నారని.. విడిపించేందుకు డబ్బులు పంపాలని అడగ్గా.. అనుమానం వచ్చిన మహేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి ప్రవీణ్‌కు గిఫ్ట్ కూపన్ గెలిచారంటూ స్పీడ్ పోస్ట్ ద్వారా కూపన్ పంపారు. బహుమతి పొందాలంటే రూ.4,500 పంపాలన్నారు. విడతల వారీగా రూ.24 వేలు వసూలు చేశారు. అనంతరం స్పందించకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. రెండు ఫిర్యాదులపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
suspension: మృతుని భార్యతో వివాహేతర సంబంధం.. ఎస్సై సస్పెన్షన్!