తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలని... వాళ్ల విషయంలో పిల్లల ఆలోచనా దృక్పథం మారాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా కార్ఖానాలోని వృద్ధాశ్రమంలో కుటుంబ సమేతంగా సజ్జనార్.. వేడుకలు నిర్వహించారు. ఆశ్రమంలో వృద్ధురాలితో కేక్ కట్ చేయించారు. అనంతరం వృద్ధులకు అల్పాహారం, మిఠాయి అందించారు.
వృద్ధాశ్రమాలు లేని సమాజాన్ని రూపొందించాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి చేరుకున్న తర్వాత కొంతమంది కుమారులు వాళ్లను పట్టించుకోకుండా వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారని చెప్పారు.
ఇదీ చదవండి: రెవెన్యూ అధికారుల తీరుతో రైతు ఆత్మహత్య