ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంతాపం ప్రకటించింది. ఇందిరాభవన్లో సీడబ్యూసీ సభ్యుడు మల్లిఖార్జున ఖర్గే, ఇతర కాంగ్రెస్ నాయకులు రెండు నిముషాల పాటు మౌనం పాటించి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
సంగీత స్వరపుత్రుడు మరణం సంగీత లోకానికి తీరని లోటని మల్లిఖార్జున ఖర్గే అన్నారు. బాలసుబ్రమణ్యం కుటుంబానికి సానుభూతి తెలియచేసిన ఆయన... ఎస్పీబీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నట్లు తెలిపారు.