ETV Bharat / state

ఐదో విడత హరితహారంపై సీఎస్​ దృశ్యమాధ్యమ సమీక్ష - CS_Harithahaaram_

వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నందున హరితహారం ముమ్మరంగా జరిగేలా చూడాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.

ఐదో విడత హరితహరంపై సీఎస్​ దృష్యమాధ్యమ సమీక్ష
author img

By

Published : Jul 30, 2019, 8:28 PM IST

ఐదో విడత హరితహారంపై సీఎస్​ ఎస్కే జోషి అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. వర్షాలు కురుస్తున్నందున హరితహారంలో భాగంగా భారీ ఎత్తున మొక్కలు నాటించాలని సూచించారు. నాటిన మొక్కల సంఖ్య కంటే వాటిని బతికించే విధానంపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టాలని సీఎస్ కోరారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద హరితహారం కోసం ఏడు కోట్ల రూపాయలు సమకూర్చుకున్న మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీరెడ్డిని అభినందించారు. అన్ని జిల్లాలు, పట్టణ ప్రాంతాల్లో సామాజిక బాధ్యత కింద వివిధ సంస్థలు, పరిశ్రమలు హరితహారంలో తమవంతు పాత్ర పోషించేలా ప్రోత్సహించాలని కలెక్టర్లకు సూచించారు.

మొక్కల రక్షణ కోసం ఉపాధి హామీ నిధులతో అనుసంధానం చేసి వాచర్లను నియమించాలని సూచించారు. క్షీణించిన అటవీ ప్రాంతాల పునరుజ్జీవనంలో భాగంగా నాటుతున్న మొక్కల్లో అధికశాతం స్థానిక వాతావరణ పరిస్థితులను తట్టుకుని ఎదిగే మొక్కలనే నాటాలని జోషి తెలిపారు. బుధవారం పదవీ విరమణ చేయనున్న అటవీ సంరక్షణ ప్రధాన అధికారి పీకే ఝాను సీఎస్, ఉన్నతాధికారులు, కలెక్టర్లు సమావేశంలో అభినందించారు.

ఇలా చేస్తే మెరుగైన ఫలితాలొస్తాయి

హరితహారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్న మొక్కలు నాటొద్దని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా సూచించారు. మొక్కలను బతికించుకునేందుకు వర్షాలను సద్వినియోగం చేసుకోవచ్చని ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ తెలిపారు. అన్ని శాఖల మధ్య సమన్వయంతో కృషిచేస్తే మెరుగైన ఫలితాలు సాధించొచ్చని పీసీసీఎఫ్ ప్రశాంత్ కుమార్ ఝా అన్నారు. గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ సిబ్బందికి గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హరితహారం అవగాహన, శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ తెలిపారు.

ఐదో విడత హరితహారంపై సీఎస్​ దృశ్యమాధ్యమ సమీక్ష

ఇదీ చూడండి: 'నగరంలో వాయు కాలుష్యం తీవ్రత ఆందోళనకరం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.