రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ, వయో పరిమితి పెంపు వంటి అంశాలపై... ఉద్యోగ సంఘాలతో రేపట్నుంచి చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎస్ సోమేశ్ కుమార్ నేతృత్వంలోని అధికారుల కమిటీ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సోమవారం సమావేశమై.. పలు అంశాలపై చర్చించింది.
ఉద్యోగ సంఘాలతో చర్చల షెడ్యూలు సైతం రూపొందించింది. దాని ప్రకారం... ఈ నెల 27 నుంచి చర్చలు జరిగే అవకాశం ఉంది. గుర్తింపు పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను చర్చలకు పిలవనున్నట్లు సమాచారం.
రెండు రోజుల పాటు చర్చలు జరిగే అవకాశం ఉంది. చర్చల ఆధారంగా వేతన సవరణ, పదవీ విరమణ వయస్సు పెంపు అంశాలపై... అధికారుల కమిటీ ముఖ్యమంత్రికి నివేదిక అందించనుంది.
ఇదీ చూడండి : గాన గంధర్వుడికి పురస్కారాలు దాసోహం