రాష్ట్రంలో భారీ వర్షాలకు నష్టపోయిన కుటుంబాలకు ఇప్పటి వరకు రూ. 387 కోట్లు పంపిణీ చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. వరద బాధిత కుటుంబాలకు నగదు పంపిణీపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌లతో సీఎస్ సమీక్ష నిర్వహించారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలకు రూ. పదివేలు చొప్పున నగదు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం రూ. 550 కోట్లు మంజూరు చేసింది. కాగా ఇప్పటి వరకు 3.87 లక్షల వరద బాధిత కుటుంబాలకు నగదు పంపిణీ జరిగిందని సీఎస్ తెలిపారు. వరదల ప్రభావానికి గురైన మిగిలిన కుటుంబాలకు త్వరలో నగదు పరిహారం అందిస్తామని ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండి: 'నీ దగ్గర ఛాయ్ బావుంటుందంటా... నాకు ఇవ్వూ'