ETV Bharat / state

'జాతీయ రహదారుల వెంట రంగురంగుల పూలమొక్కలు'

author img

By

Published : Feb 20, 2021, 4:48 AM IST

జాతీయ రహదారుల వెంట రంగురంగుల పూలమొక్కలు నాటాలని సీఎస్‌ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మల్టీలెవల్‌ ఎవెన్యూ ప్లాంటేషన్‌పై వివిధ శాఖల అధికారులతో సీఎస్‌ సమీక్ష నిర్వహించి... పలు నిర్ణయాలు తీసుకున్నారు.

cs somesh kumar on national highways in hyderabad
'జాతీయ రహదారుల వెంట రంగురంగుల పూలమొక్కలు'

ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశాలతో రాష్ట్రంలోని జాతీయ రహదారుల వెంట రంగురంగు పూలమొక్కలు నాటాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. రోడ్ల వెంట ఆహ్లాదకర వాతావరణం కల్పిచేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. జీహెచ్​ఎంసీ, హెచ్​ఎండీఏ, ఓఆర్​ఆర్​, రహదారులు- భవనాల శాఖ, మున్సిపాలిటీ పంచాయతీరాజ్ అధికారులతో జాతీయ రహదారుల వెంట మల్టీలెవల్ ఎవెన్యూ ప్లాంటేషన్ కోసం హైదరాబాద్​లో సీఎస్‌ సమీక్ష నిర్వహించారు.

మొక్కలు నాటేందుకు కావాల్సిన రోడ్ల విస్తరణ, నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు. నాటిన మొక్కల వివరాలను జిల్లాల వారీగా రూపొందించాలని అధికారులకు సూచించారు. సింగిల్ లేయర్ ప్లాంటేషన్‌లో ప్రత్యేక మొక్కలు నాటాలని స్పష్టం చేశారు. వివిధ శాఖల సమన్వయంతో రహదారుల వెంట మల్టీ లెవల్ ప్లాంటేషన్ విస్తరణ వివరాలతో కూడిన నివేదికను జిల్లాల వారీగా రూపొందించాలని పేర్కొన్నారు.

cs somesh kumar on national highways in hyderabad
అధికారులతో జాతీయ రహదారుల వెంట మల్టీలెవల్ ఎవెన్యూ ప్లాంటేషన్ కోసం సీఎస్‌ సమీక్ష

ఇదూ చూడండి: 'సంక్షేమ పథకాలు వివరిస్తూ సభ్యత్వం పొందేలా చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.