ETV Bharat / state

'గ్రామాల్లో స్పష్టమైన మార్పురావాల్సిందే..!'

30 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా చేపడుతున్న పనుల ద్వారా గ్రామాల్లో స్పష్టమైన మార్పురావాలని సీఎస్​ జోషి అన్నారు. బుధవారం నాడు కలెక్టర్లతో దృశ్యమాధ్యమ సమావేశం నిర్వహించారు. మన పరిసరాలను మనమే బాగుచేసుకుందామనేలా ప్రజల ఆలోచనల్లో తీసుకురావాలని సూచించారు.

author img

By

Published : Sep 19, 2019, 5:01 AM IST

Updated : Sep 19, 2019, 8:06 AM IST

'గ్రామాల్లో స్పష్టమైన మార్పురావాల్సిందే..!'

ఈనెల 6 నుంచి ప్రారంభమైన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా చేపడుతున్న పనుల ద్వారా గ్రామాల్లో స్పష్టమైన మార్పు కనిపించాలని సీఎస్​ ఎస్​కే జోషి స్పష్టం చేశారు. బుధవారం రోజున బీఆర్కే భవన్​ నుంచి కలెక్టర్లతో సీఎస్​ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. గ్రామాభివృద్ధి ప్రణాళికలో చేపడుతున్న పనులు నిరంతరం అమలయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం గ్రామాల్లో వార్షిక, పంచవర్ష ప్రణాళికలు రూపొందించాలని నిర్దేశించారు. డంపింగ్​ యార్డులు, వైకుంఠ ధామాలు, నర్సరీలకు స్థలాలను గుర్తించి, నిర్మాణాలు చేపట్టాలన్నారు.

గ్రీన్​ యాక్షన్​ ప్లాన్​

మన ఊరు మనమే బాగు చేసుకుందాం అనేలా ప్రజల ఆలోచన విధానంలో మార్పు తీసుకురావాలని జోషి సూచించారు. ప్రతి గ్రామంలో గ్రీన్​ యాక్షన్​ ప్లాన్​ను రూపొందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఓఎస్​డీ ప్రియాంక వర్గీస్, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ రఘునందన్​రావు, సెర్ఫ్​ సీఈవో పౌసమి బసు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

గ్రామాల్లో స్పష్టమైన మార్పురావాల్సిందే..!
ఇదీ చూడండి: గ్రామపంచాయతీ వ్యవస్థలో నూతన శకం ఆరంభం..!

Intro:Body:Conclusion:
Last Updated : Sep 19, 2019, 8:06 AM IST

For All Latest Updates

TAGGED:

CS_REVIEW
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.