65 మందికి శిక్షకులకు శిక్షణ
రాష్ట్రంలో 71,136 ఎన్యుమరేటర్ల ద్వారా జనాభా లెక్కలను సేకరిస్తామని సీఎస్ తెలిపారు. ఇందుకోసం 65 మంది ముఖ్య శిక్షకులకు మొదటి విడత శిక్షణ ముగిసిందన్నారు. రెండో విడత ఈ నెల 7 వరకు పూర్తవుతుందన్నారు. ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లకు క్షేత్రస్థాయి శిక్షకులు ఏప్రిల్లో శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు.
వివరాలన్నీ...
జనాభా లెక్కల్లో భాగంగా నివాసాల గుర్తింపు, గణన, జనాభా వివరాలతో పాటు జాతీయ జనాభా రిజిస్టర్ను ఆధునికీకరిస్తామని సీఎస్ జోషి వెల్లడించారు. వ్యక్తుల వివరాలతో పాటు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, నివాస వివరాలు సేకరిస్తారన్నారు. మొబైల్ అప్లికేషన్, పేపర్ షెడ్యూలు ద్వారా జనాభా లెక్కల కోసం వివరాలు సేకరిస్తారని.. ఎన్యుమరేషన్ బ్లాకులుగా ఏర్పాటు చేసి అధికారులను నియమిస్తారని జోషి తెలిపారు. ఇప్పటి వరకు చేపట్టిన చర్యలను సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ ఇలంబర్తి వివరించారు.
ఇవీ చూడండి : దిశ నిందితులను కస్టడీకి కోరనున్న పోలీసులు