ETV Bharat / state

మద్యం దుకాణాల ముందు... బారులుతీరిన మందుబాబులు - wine shops

రాష్ట్రంలో నేటి నుంచి మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో ఉదయం నుంచే జనం దుకాణాల ముందు బారులుతీరారు.

crowd-in-front-of-wine-shops-from-morning
మద్యం దుకాణాల ముందు... బారులుతీరిన మందుబాబులు
author img

By

Published : May 6, 2020, 10:19 AM IST

లాక్​డౌన్ నేపథ్యంలో మద్యం దుకాణాలను 40 రోజులకు పైగా మూసివేశారు. నేటి నుంచి మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచే వైన్ షాపుల ముందు బారులుతీరారు. భౌతిక దూరం పాటించేలా దుకాణాల ముందు ఏర్పాట్లు చేసినా.. వాటిని పట్టించుకోవడం లేదు. కూకట్​పల్లి హైటెక్​ సిటీ దారిలో ఉన్న టానిక్ షోరూం వద్ద ఉదయం 8 గంటలకే 100 మందికి పైగా క్యూ కట్టడం గమనార్హం.

మరోవైపు సికింద్రాబాద్​లోని చిలకలగూడ, మారేడ్​పల్లి, అల్వాల్​, అడ్డగుట్ట, బోయిన్​పల్లి ప్రాంతాల్లో మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా వైన్స్ యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సికింద్రాబాద్ పాస్​పోర్టు కార్యాలయం ఎదుట ఉన్న అభిజిత్ వైన్స్ ఉదయం 9 గంటలకే తెరవడం వల్ల పోలీసులు అక్కడికి చేరుకొని.. దుకాణాన్ని మూయించారు.

తిరుమలగిరిలోని ఓ వైన్​ షాప్​ ఎదుట దుకాణాలు తెరుచుకుంటున్నాయన్న ఆనందంలో ఓ మందుబాబు నృత్యం చేశాడు. మద్యం దుకాణాల వద్ద రద్దీ లేకుండా.. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు గస్తీ పెంచారు.

మద్యం దుకాణాల ముందు బారులుతీరిన జనం

ఇదీ చూడండి: దేశ వ్యాప్తంగా 27.11 శాతం పెరిగిన నిరుద్యోగ రేటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.