ETV Bharat / state

మిగ్​జాం ఎంత పనిచేసింది - కోతకొచ్చిన పంటను నేలరాల్చింది - ధాన్యం కుప్పలను నీట ముంచింది - తెలంగాణ అకాల వర్షాలు

Crop Damage Due to Michaung Cyclone in Telangana : ఆంధ్రప్రదేశ్‌లో బీభత్సం సృష్టించిన మిగ్‌జాం తుపాను రాష్ట్రంపైనా తీవ్ర ప్రభావం చూపింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి పలు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంటలకు అపారనష్టం వాటిల్లింది. కల్లాలతో పాటు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తడిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బుధవారం పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందన ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సీఎస్‌ శాంతికుమారి అధికారులను ఆదేశించారు.

Michaung Cyclone Crop Effect
Crop Damage in Telangana 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 6, 2023, 8:11 AM IST

మిగ్​ జాం తుఫాను ప్రభావం - నష్టాల్లో మునుగుతున్న తెలంగాణ రైతులు

Crop Damage Due to Michaung Cyclone in Telangana : ఏపీలో తీరందాటిన మిగ్‌జాం తుపాను ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో భారీవర్షాలు కురిశాయి. అత్యధికంగా అశ్వరావుపేటలో 18.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో కురిసిన భారీవర్షానికి వరి, పత్తికి ఆపార నష్టం వాటిల్లింది. రోడ్లపై ఆరబోసిన వడ్లు వర్షాలకు పూర్తిగా తడిసిపోయాయి.

Peanut Crop Heavy Damage in Khammam : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలతో సుమారు 4 వేల ఎకరాలకుపైగా వేరుశనగ దెబ్బతింది. ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలో పలు చోట్ల వర్షాలు పడ్డాయి. బుధవారం పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మలుగు జిల్లాతో పాటు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ(Department of Meteorology Instructions on Rains) హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కోంది. రాష్ట్రవ్యాప్తంగా జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Crop Damage in Telangana Due to Sudden Rains : పంటలకోత ముగింపు దశలో భారీ వర్షాలు(Telangana Heavy Rains), ఈదురు గాలులతో రైతులు నష్టపోయారు. పొలాల్లో కోసి ఉంచిన వరి, కల్లాలో ఆరపెట్టిన పంట, కోనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడిసిపోయిందని అన్నదాతలు వాపోయారు. పత్తి, మిర్చి పంటలకు నష్టం వాటిల్లింది. యాసంగి సీజన్‌లో సాగు చేసిన పంటపొలాల్లోకి నీరు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 వేల ఎకరాల్లో పత్తి ఏరుతున్నారు. ప్రస్తుతం వర్షాలు కురువడంతో తీవ్రంగా నష్టం వాటిల్లింది. సుమారు 82 వేల ఎకరాల్లో కూరగాయలు సాగుచేయగా జోరువాలనలకు అవి దెబ్బతిన్నాయి. ముఖ్యంగా కరీంనగర్, వరంగల్‌, సిద్దిపేట జిల్లాలో కూరగాయ పంటలకు తీవ్ర నష్టం జరిగింది.

కొనుగోలు కేంద్రాలు తెరిచినా కనిపించని రైతులు

  • తెలంగాణలో పలు జిల్లాలలో తుఫాను ప్రభావంపై ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి.

    వరి ధాన్యం తడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

    ఏజెన్సీ, లోతట్టు ప్రాంతాల్లో జన జీవనానికి ఇబ్బంది కలుగకుండా చూడాలి.

    అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి.

    — Revanth Reddy (@revanth_anumula) December 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Revanth Reddy Tweet on Crop Damage : మిగ్‌జాం తుపాను(Michaung Cyclone Effect) నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వరి ధాన్యం తడిచిపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏజెన్సీ, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని రేవంత్‌రెడ్డి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మిగ్‌జాం తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలపై కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

CS Shanthi Kumari Instructions on Michaung Cyclone : వివిధ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నందున కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. పూర్తిగా నిండిన చెరువులకు గండ్లు పడకుండా చూడాలన్నారు. భద్రాద్రి, ములుగు జిల్లాలకు ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలను పంపిస్తున్నామని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏకధాటిగా జల్లులు కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పగటిపూట సాధారణం కంటే రెండు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు తగ్గాయి.

తెలంగాణపై మిగ్​జాం తుపాన్ ఎఫెక్ట్​ - అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు​

వరి ధాన్యం డబ్బుల కోసం చెప్పులను క్యూ లైన్​లో పెట్టిన రైతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.