ETV Bharat / state

ఈ ఏడాది హైదరాబాద్​ కమిషనరేట్​లో తగ్గిన నేరాలు - హైదరాబాద్​ సీపీ అంజనీ కుమార్​ వార్తలు

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నేరాల శాతం తగ్గింది. సైబర్ క్రైం నేరాలు మినహా.. ఇతర నేరాలు తగ్గినట్లు వార్షిక నేర నివేదికలో అధికారులు పొందుపర్చారు. గతేడాతో పోలిస్తే మహిళలు,చిన్నారులపై దాడులు, హత్యలు, హత్యాయత్నాలు, అపహరణలు, గొలుసు దొంగతనాలు, రహదారి ప్రమాదాలు తగ్గాయి. కరోనా సమయంలోనూ పోలీసులు మనోనిబ్బరంతో విధులు నిర్వహించారు.

crime rate decrease in Hyderabad commissionarate  in 2020
ఈ ఏడాది హైదరాబాద్​ కమిషనరేట్​లో తగ్గిన నేరాలు
author img

By

Published : Dec 21, 2020, 10:32 PM IST

పోలీసులు చేపడుతున్న చర్యలు, తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తల వల్ల హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నేరాల శాతం తగ్గింది. గతేడాదితో పోలిస్తే అన్ని రకాల నేరాల్లో 10 శాతం తగ్గుదల నమోదైంది. హత్యలు 24 శాతం, హత్యాయత్నాలు 39 శాతం, అపహరణలు 34 శాతం, మోసాలు 35 శాతం, అల్లర్లు, 47 శాతం, దోపిడీలు 62 శాతం, దొంగతనాలు 30 శాతం, గొలుసు దొంగతనాలు 62 శాతం, వాహనాల దొంగతనాలు 22 శాతం, మహిళలపై నేరాలు 19 శాతం, చిన్నారులపై నేరాలు 35 శాతం తగ్గాయి. అంతర్జాతీయ నగరాలైన న్యూయార్క్, లండన్​తో పోలిస్తే హత్యలు అతి తక్కువగా నమోదయ్యాయని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. తరచూ మోసాలకు పాల్పడే వాళ్లపై పీడీ చట్టం కింద కేసు నమోదు చేసి... మరోసారి నేరాలకు పాల్పడకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

3.6 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు

ఈ ఏడాది 123 మంది నేరగాళ్లపై పీడీ యాక్ట్​ ప్రయోగించారు. 4,660 మంది కరుడు గట్టిన నేరగాళ్లు, 1,600 మంది రౌడీషీటర్ల ఇంటికి పోలీసులు తరచూ వెళ్లి తనిఖీ చేస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 10 వేల చోట్ల క్రమం తప్పకుండా తనిఖీలు చేపడుతున్నారు. డయల్ 100 కూడా నేరాల అదుపునకు ఎంతో ఉపయోగపడుతోంది. ఈ ఏడాది 2 లక్షలకు పైగా డయల్ 100కు ఫోన్లు వచ్చాయి. ఈ లెక్కన రోజుకు 500పైన ఫోన్లు వచ్చాయి. ఫోన్ వచ్చిన వెంటనే దాదాపు 6 నిమిషాల్లో గస్తీ వాహనం సంఘటనా స్థలానికి చేరుకుంటోంది. సీసీ కెమెరాల వల్ల ఎన్నో కీలకమైన కేసుల్లో పురోగతి సాధించారు. ఇప్పటి వరకు 3.6 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దొంగతనాల కేసుల్లోనూ పోలీసుల రికవరీ శాతం 70 శాతం వరకు ఉంది.

మతఘర్షణలు చోటుచేసుకోకుండా

ఈ ఏడాది ఎలాంటి మతఘర్షణలు చోటుచేసుకోకుండా చూడటంలో పోలీసులు సఫలమయ్యారు. గణపతి ఉత్సవాలు, మొహర్రం ఊరేగింపు, రంజాన్​తోపాటు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎక్కడా గొడవలు తలెత్తకుండా బందోబస్తు నిర్వహించారు. రహదారి ప్రమాదాలు 34 శాతం తగ్గి.. మరణాల్లోనూ 17 శాతం తగ్గుదల నమోదైంది. 1,738 ప్రమాదాలు చోటుచేసుకోగా 237 మంది మృతి చెందారు. వాహనాలు ఢీకొనడం వల్ల 474 మంది పాదచారులకు గాయాలు కాగా.. 68 మంది చనిపోయారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని 54 లక్షల మందిపై కేసులు నమోదు చేశారు. మోతాదుకు మించి మద్యం సేవించిన 5,591 మందిపై కేసు నమోదు చేసి.... న్యాయస్థానం ఆదేశాల మేరకు రూ. 5.2 కోట్ల జరిమానా వసూలు చేశారు.

పెరిగిన సైబర్​ నేరాలు

అన్ని నేరాలు తగ్గినా సైబర్ నేరాలు మాత్రం పెరిగాయి. నెట్​ వినియోగం పెరగటంతోపాటు... వినియోగదారుల ఏమరపాటు, నిర్లక్ష్యం, అవగాహన లేకపోవడం వల్ల సైబర్ నేరాలు పెరుగుతున్నట్లు పోలీసుల పరిశీలనలో తేలింది. సైబర్ నేరాలకు పాల్పడుతున్న 12 రాష్ట్రాలకు చెందిన 259 మందిని అరెస్ట్ చేశారు. నగరవాసులను, పోలీసులను అనుసంధానం చేసేలా తీసుకొచ్చిన హాక్-ఐ యాప్​ వినియోగించే వాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 14 లక్షల మంది దీన్ని డౌన్​లోడ్ చేసుకొని వినియోగిస్తున్నారు. ఆపదలో ఉన్న, ఇతర అవసరాలు, ఫిర్యాదుల కోసం హాక్-ఐ అప్లికేషన్​ను ప్రజలు ఉపయోగించుకుంటున్నారు.

కరోనా సవాళ్లను ఎదుర్కొని

మహిళల భద్రత కోసం ఉద్దేశించిన షీటీమ్​లు ఆశించిన మేర పనిచేస్తున్నాయి. ఈ ఏడాది 970 ఫిర్యాదులు షీటీమ్​లకు వచ్చాయి. లాక్​డౌన్ వేళ పోలీసులు సవాళ్లతో కూడుకున్న విధులు నిర్వహించారు. ఈ క్రమంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 3 వేల మంది పోలీసులు కరోనా బారిన పడగా... అందులో 39 మంది మృతి చెందారు. వచ్చే ఏడాది మరింత కృషి చేసి నేరాలు తగ్గించటంతోపాటు.. రహదారి ప్రమాదాలు తగ్గేలా ఉన్నతాధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రాల సమన్వయంతోనే మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట: డీజీపీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.