ETV Bharat / state

క్రికెట్ బెట్టింగ్​ ముఠా గుట్టురట్టు - cricket

పోలీసులు నిఘా పెంచడం వల్ల పందెం రాయుళ్లు కొత్త మార్గాల్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. వరల్డ్​కప్ సందర్భంగా చరవాణుల్లో అక్రమంగా యాప్​లు తయారుచేసి విదేశాల నుంచి ఆపరేట్ చేస్తు కోట్లు గడిస్తున్నారు. నగరంలో క్రికెట్​ బెట్టింగ్​కు పాల్పడుతున్న ముఠాను దక్షిణ మండల టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.

బెట్టింగ్​ ముఠా
author img

By

Published : Jun 13, 2019, 4:52 AM IST

Updated : Jun 13, 2019, 6:34 AM IST

సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో బర్కత్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి బెట్టింగ్ రాకెట్​కు తెరలేపాడు. భారత్​లో అయితే న్యాయ పరమైన చిక్కులు వస్తాయని అమెరికా వెళ్లి మ్యాచ్ బాక్స్ డాట్ కాం అనే మొబైల్ యాప్​ని సృష్టించాడు. హైదరాబాద్​తో పాటు గోవా, బెంగళూరు నగరాల నుంచి కొంత మందిని యాప్​లో చేర్చుకుని కమిషన్ ద్వారా బెట్టింగ్ నిర్విహిస్తున్నాడు. బెట్టింగ్​ ముఠా గురించి పక్కా సమాచారం అందుకున్న టాస్క్​ఫోర్స్​ పోలీసులు దాడిచేసి ఆరుగురుని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఎనిమిది లక్షల రూపాయల నగదు, ఆరు చరవాణులు, కారు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు బర్కత్ అమెరికాలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి: 'నిజాయతీ ఉంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయండి'

sample description
Last Updated : Jun 13, 2019, 6:34 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.