జనతా కర్ఫ్యూలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. సాయంత్రం ఐదు గంటలకు ఇళ్ల నుంచి బయటకు వచ్చి కరతాళ ధ్వనులు చేశారు. సైబర్ టవర్స్ వద్ద సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, ట్యాంక్‌బండ్ వద్ద హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ లు చప్పట్లు కొట్టి... విశిష్ఠ సేవలందిస్తున్న వైద్యులకు మద్దతు తెలిపారు.
మరికొన్నిరోజులు ఇలా సంయమనం పాటిస్తే వైరస్‌ను పూర్తిస్థాయిలో అరికట్టవచ్చని సీపీ అంజనీకుమార్ అన్నారు. జనతా కర్ఫ్యూలో 99 శాతం మంది ప్రజలు సహకరించారని పేర్కొంటూ వారందరికీ కృతజ్ఞతలను సీపీ తెలిపారు. దీనిలో భాగంగా పోలీసులు కవాతును ప్రదర్శించారు.
ఇదీ చూడండి : సైబరాబాద్‌లో సజావుగా జనతా కర్ప్యూ: సీపీ సజ్జనార్