కమిషనరేట్ పరిధిలో మహిళా కౌన్సిలింగ్ సెంటర్ను నిన్న రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ప్రారంభించారు. మహిళల భద్రత, సమస్యల పరిష్కారం కోసమే దీన్ని ఏర్పాటు చేశామన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న మహిళల సమస్యలను పరిష్కరించేందుకు ఇది చాలా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఫ్యామిలీ కౌన్సిలింగ్ ముఖ్య ఉద్దేశం కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడం, భార్య భర్తల మధ్య అపోహలు తొలగిపోయి కలిసుండేలా ఈ కౌన్సిలింగ్ సెంటర్ పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ సుధీర్బాబు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : ఎవరెస్టు అధిరోహకురాలు 'పూర్ణ' పుస్తకావిష్కరణ