చేప పిల్లల పంపిణీ కోసం 2020-21 సంవత్సరానికి మత్స్యశాఖ ద్వారా జిల్లా కలెక్టర్ స్థాయిలో పిలిచిన టెండర్లను వెంటనే రద్దు చేయాలని కోరుతూ సీఎం కేసీఆర్కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు. మత్స్య పరిశ్రమలో దళారీ విధానం పోవాలని మత్స్య సొసైటీలు స్వయంసమృద్ధి సాధించాలని కోరారు. కోట్ల రూపాయల విలువైన ఈ పథకం అవినీతిమయం అయిందని తెలిపారు.
సొసైటీలు స్వయం సమృద్ధి సాధించాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే చేప, రొయ్య పిల్లల పంపిణీ పారదర్శకంగా అమలు చేయాలని ఆయన కోరారు. అలాగే జలాశయాలు, రిజర్వాయర్లు, నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రభుత్వం సీడ్ కేంద్రాలను నిర్మించి, మత్స్యకారులను ఆదుకునే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.