Thammineni letters to KCR: పోలీసు ఈవెంట్లలోని నియమాలను సవరించాలని తమ్మినేని వీరభద్రం ముఖ్యమంత్రికి లేఖ రాశారు. పరుగులో ఉత్తీర్ణులైన అభ్యర్థులందరికీ మెయిన్స్‌కు అవకాశం కల్పించాలన్నారు. లాంగ్‌జంప్‌ను 4మీటర్ల నుంచి 3.80 మీటర్లకు తగ్గించి ఆన్ ద లైన్ జంప్‌ను అనుమతించాలని తెలిపారు. షార్ట్‌పుట్‌ను 6 మీటర్ల నుంచి 5.60 మీటర్లకు తగ్గించాలన్నారు.
డిజిటల్ విధానంలో కాకుండా పాత పద్దతిలోనే మ్యాన్వల్గా అభ్యర్థుల ఎత్తు కొలతలు తీసుకోవాలని పేర్కొన్నారు. రన్నింగ్ అనంతరం రెండు గంటలు లేదా ఒక రోజు సమయమిచ్చి మిగతా ఈవెంట్స్ నిర్వహించాలన్నారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి వేర్వేరుగా ఈవెంట్స్ నిర్వహించాలని... కమ్యూనికేషన్, ఫైర్‌మెన్, సివిల్ విభాగాల్లో బెస్ట్ ఆఫ్ టూ ఈవెంట్స్‌ను అమలు చేయాలని తెలిపారు.
పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో కలిపి పెద్ద ఎత్తున పోస్టులను ప్రభుత్వం భర్తీ ఉపక్రమించింది. కానిస్టేబుల్ పోస్టులతో పాటు వివిధ విభాగాల్లో భారీ స్థాయిలో ఎస్‌ఐ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 16,027 కానిస్టేబుల్, 587 ఎస్‌ఐ పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈసారీ భర్తీకి మునుపటి పద్దతిలో కాకుండా కొత్త నియమాలను అమలు చేస్తున్నారు. నెగిటివ్ మార్కింగ్ విధానం, ఈవెంట్లకు డిజిటల్ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. ప్రిలిమ్స్ పరీక్షలో అందరికీ సమాన కటాఫ్ మార్కులను నిర్దేశించారు.
ఇవీ చదవండి: