ETV Bharat / state

'ఆధార్​తో సంబంధం లేకుండా మంచినీటిని సరఫరా చేయాలి' - CPM latest news

ఆధార్​ కార్డు లింక్​ లేకుండా వినియోగదారులందరికీ మంచినీటి సరఫరా చేయాలని సీపీఎం నగర కమిటీ సమావేశం నిర్వహించింది. గ్రేటర్​ మున్సిపల్​ ఎన్నికల్లో తెరాస ప్రభుత్వం ప్రజలకు ఉచిత మంచినీటి సరఫరా పథకాన్ని అమలు చేయడానికి అనేక షరతులు పెట్టడం ఏమాత్రం సమంజసం కాదని సీపీఎం నగర కార్యదర్శి ఎం. శ్రీనివాస్​ అన్నారు.

Breaking News
author img

By

Published : Dec 22, 2020, 6:54 PM IST

ఆధార్​తో సంబంధం లేకుండా మంచినీటిని సరఫరా చేయాలని సీపీఎం నగర కమిటీ హైదరాబాద్​ బాగ్​లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్​ టేబుల్ సమావేశం జరిగింది. ఆధార్​తో సంబంధం లేకుండా జలమండలి పరిధిలోని గృహ వినియోగదారులందరికీ ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించి.. మరోవైపు ఆధార్​ని అనుసంధానం చేయాలని షరతులు విధించడం వెనుక మతలబు ఏమిటని సీపీఎం నగర కార్యదర్శి ఎం. శ్రీనివాస్​ ప్రశ్నించారు.

తాగునీరు పొందుతున్న గృహ వినియోగదారులందరికీ ఆధార్​ తప్పనిసరి చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం జలశక్తి మంత్రిత్వశాఖ 2019లో జారీ చేసిన ఆదేశాల అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోందని అన్నారు.

రక్షిత తాగునీరు పొందడం ప్రజల హక్కు అని పేర్కొన్నారు. తాగునీటిని ప్రజలకు అందించడం ప్రభుత్వాల బాద్యతని తెలిపారు. కానీ ఆ బాధ్యతను విస్మరించి.. తాగునీటిని సరకుగా మార్చడం సమంజసం కాదని వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.