కేంద్రంలో భాజపా ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు ఆరోపించారు. కరోనా సమయంలో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల జీఎస్టీ వాటా చెల్లించాలని, పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమంలో చెరుపల్లి సీతారాములుతోపాటు నగర కార్యదర్శి శ్రీనివాస్ ఇతర పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆరు నెలలపాటు ఉచిత రేషన్‌తోపాటు నెలకు 7వేల 500రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేకంగా విద్యుత్, రైతు బిల్లులను తీసుకువచ్చిందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ కనుసన్నుల్లో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని దుయ్యబట్టారు.
ఇవీ చూడండి: రాష్ట్రానికి రావాల్సిన ఐజీఎస్టీ బకాయిలు వెంటనే ఇవ్వాలి: హరీశ్