మ ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల ఆరోగ్య అవసరాల కోసం ఏర్పాటు చేసిన వెల్నెస్ కేంద్రాలు అవినీతి, అక్రమాలకు అడ్డాలుగా మారుతున్నాయని సీపీఎం ఆరోపించింది. ఈ మేరకు ఖైరతాబాద్‌లోని వెల్నెస్ కేంద్రం ఎదుట సీపీఎం నగర కార్యదర్శి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
మందుల వ్యాపారులతో కుమ్మక్కై... కాలం చెల్లనున్న మందులను కొనుగోలు చేయటం ద్వారా కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారంటూ ఆరోపించారు. గత నెల 31న ఖైరతాబాద్ వెల్నెస్ కేంద్రం నుంచి భారీ మొత్తంలో కాలం చెల్లిన మందులను తరలిస్తుండగా సీపీఎం తీసిన దృశ్యాలను వారు విడుదల చేశారు. కార్యాలయ సమయం ముగిసిన తర్వాత... ఎవరూ లేని సమయంలో మందులను తరలించాల్సిన అవసరం ఏంటని వారు ప్రశ్నించారు. గడువు ముగియటానికి 3 నెలల ముందే మందులను తిరిగి ఫార్మా కంపెనీలకు పంపాల్సి ఉన్నా... వెల్నెస్ కేంద్రాల ప్రతినిధులు ఆ పనిచేయక పోగా.. గుట్టు చప్పుడు కాకుండా మందులు ఇతర ప్రాంతాలకు తరలించేస్తున్నారని మండిపడ్డారు.
- ఇదీ చదవండి: తపాలా సొమ్ము ఏ బ్యాంకుకైనా బదిలీ: సీపీఎంజీ