రాష్ట్రంలోని 12 వెల్నెస్ కేంద్రాల్లో జరిగిన అవినీతి అక్రమాలు- ప్రజాధనం వృథాపై విచారణ జరిపించాలని హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సీపీఎం నగర కార్యాలయంలో సీపీఎం కార్యకర్తలు డిమాండ్ చేశారు. గతేడాది నవంబర్ నెలలో ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్లో జరిగిన ఔషధ అక్రమాలను బహిర్గతం చేసినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటని పార్టీ నగర కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నించారు.
ఖైరతాబాద్ వెల్నెస్ కేంద్రంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిగినట్లు కనిపించినా.. ఇప్పటికీ సంబంధిత అధికారులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు చేపట్టలేదని శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పాత్రికేయుల సంఘాల ప్రతినిధులు వెల్నెస్ సెంటర్ల అక్రమాలపై పోరాటం చేయాల్సిన అవసరముందని ఆయన అన్నారు. అక్రమాలపై ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు చేపట్టకపోతే.. ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండిః గ్రేటర్ డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం రూ.600 కోట్లు విడుదల