అమరావతి జనభేరికి సీపీఎం దూరంగా ఉంది. అమరావతి విషయంలో భాజపా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నందని, భాజపాను కూడా సభకు పిలవడంపై సీపీఎం అభ్యంతరం తెలిపింది. పరిపాలన రాజధాని అమరావతిలో ఉండాలని సీపీఎం స్పష్టం చేసింది.
రాజధాని కోసం జరుగుతున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొంది. భవిష్యత్తు కార్యక్రమాలకు తమ మద్దతు ఉంటుందన్న ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు.. భాజపా నేతలతో కలిసి వేదిక పంచుకోలేమని స్పష్టం చేశారు. ఈ మేరకు ఐకాస కన్వీనర్‌కు లేఖ రాశారు.
ఇదీ చదవండి : 'అమరావతిపై రెఫరెండానికి రెడీ.. ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటా'