హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద సీపీఎం పార్టీ ఆందోళన చేపట్టింది. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేసింది. రోజురోజుకూ పెరిగిపోతోన్న పెట్రో ధరలు సామాన్య ప్రజానీకంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా పెరిగిన పెట్రో ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఇతర పక్షాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. తమ పోరాటానికి ప్రజలు కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు.