కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను నీరు గారుస్తోందని సీపీఎం నాయకుడు మల్లేష్ ఆరోపించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. లాక్డౌన్ వల్ల ఇప్పటికే పలు ప్రైవేటు కంపెనీలు ఉద్యోగులను తొలిగించాయని... చాలా సంస్థలు వేతనాల్లో కోతలు విధించాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంట్రాక్ట్, ఒప్పంద ఉద్యోగులకు, కార్మికులకు సమానపనికి సమాన వేతన విధానం అమలు కావడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో సీఐటీయూ నేతలు మల్లేష్, కృష్ణ, నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కూలీ బతుకు.. అందని మెతుకు !