హుజూర్నగర్ ఎన్నికలో తెరాస అభ్యర్థికి మద్దతివ్వాలని నిర్ణయించినట్లు సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. తమ కార్యవర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. రానున్న రోజుల్లోనూ భాజపాను నిలవరించాలంటే.. తెరాస లాంటి ప్రాంతీయ పార్టీలకు తమ మద్దతుంటుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ మిత్ర ధర్మాన్ని నిలబెట్టుకోవడం లేదన్నారు. కార్యవర్గ సమావేశానికి జాతీయ నాయకులు నారాయణ, అతుల్ కుమార్ అంజన్ హాజరైనట్లు తెలిపారు.
ఇవీ చూడండి: సచివాలయం కూల్చొద్దు: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు