Kunamneni fires on BJP: దేశంలో ప్రజాస్వామ్యం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా ప్రశ్నిస్తే వరవరరావు, సాయిబాబాలాంటి వాళ్లను జైల్లో పెట్టారని మండిపడ్డారు. దేశ ప్రధాని రాముడి పేరుతో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య సంస్థలను స్వార్థం కోసం దుర్వినియోపరుస్తున్నారని సాంబశివరావు ధ్వజమెత్తారు.
రాజగోపాల్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా ప్రచారం.. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక విస్మరించారని కూనంనేని సాంబశివరావు దుయ్యబట్టారు. రెండు కోట్ల ఉద్యోగాల భర్తీ దేవుడెరుగు కానీ... సంవత్సరానికి లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి బజారున పడుతున్నారని తెలిపారు. ప్రధానికి చిత్తశుద్ది ఉంటే డబ్బులు ఖర్చు పెట్టకుండా భాజపా విధానాలతో పోటీ చేయించాలని సవాల్ విసిరారు. నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ పెద్ద మోసగాళ్లని విమర్శించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనుబంధాలను కుటుంబంలో చూసుకోవాలే తప్ప.. ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీకి ఓటేయాలని ఎలా పిలుపునిచ్చారని ప్రశ్నించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా ప్రచారం చేస్తామని కూనంనేని సాంబశివరావు తెలిపారు.
ఇవీ చదవండి: