కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను సీపీఐ తీవ్రంగా ఖండించింది. అన్ని రైతు సంఘాల సమన్వయ సంఘర్షణ సమితి పిలుపుతో శుక్రవారం తలపెట్టిన భారత్‌బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
విజయవంతం చేయాలి:
వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ వంద రోజులకు పైగా దేశవ్యాప్తంగా రైతులు అందోళన చేస్తున్నప్పటికీ కేంద్రం స్పందించకపోవడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జరిగే భారత్ బంద్‌కు వాణిజ్య, వ్యాపార వేత్తలతో పాటు ప్రజలందరూ సహకరించి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
వారి కోసమే ఈ చట్టాలు:
ఈ చట్టాల వల్ల 60 శాతానికి పైగా వ్యవసాయంపై జీవిస్తున్న రైతుల బతుకులు బజారున పడే ప్రమాదం ఉందని చాడ ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం కేవలం అంబానీ, అదానీల రుణం తీర్చుకునేందుకే ఈ చట్టాలను తీసుకొచ్చిందని మండిపడ్డారు. ఇకనైనా స్పందించి చట్టాలను వెంటనే ఉపసంరించుకోవాలని.. లేనిపక్షంలో ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఇదీ చూడండి: కొండగట్టు అంజన్న ఆలయంలో హుండీ లెక్కింపు