హైదరాబాద్ సరూర్ నగర్ చెరువులో చనిపోయిన నవీన్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. మృతుని కుటుంబాన్ని మానవతా దృక్పథంతో ఆదుకోవాలని కోరారు.
సరూర్ నగర్ చెరువు ప్రాంతాన్ని చాడ వెంకట్ రెడ్డి సందర్శించి పరిశీలించారు. చెరువులు, కుంటలు పార్కులు, నాళాలు కబ్జా చేయడం వల్లే వరదనీరు ఎక్కడికక్కడ నిలిచిపోయిందన్నారు. ప్రభుత్వం సర్వే చేయించి కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకొని.. వరదనీరు సాఫీగా సాగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే హైదరాబాద్ నరక నగరంగా మారే అవకాశాలు ఉన్నాయని వెంకట్ రెడ్డి హెచ్చరించారు.
ఇదీ చదవండి: మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాపోరాటం చేపట్టాలి: చాడ