భారత్‌పై అమెరికా పెత్తనం చెలాయించేలా ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరిస్తున్నారని సీపీఐ నాయకులు ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో బేగంపేటలోని అమెరికన్ కాన్సులేట్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. ట్రంప్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
ఈ ఆందోళన నేపథ్యంలో.. అమెరికన్ కాన్సులేట్ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. కార్యాలయ ముట్టడికి ప్రయత్నించిన 15 మంది సీపీఐ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం పీఎస్‌కు తరలించారు. రసూల్‌పురా చౌరస్తా దగ్గర సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.