భారత్లోని ఎన్నికల్లో లోపాలు సవరించకుండా.. కేంద్రం.. జమిలి ఎన్నికలు తీసుకొస్తామనడం సరైన నిర్ణయం కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కేంద్ర విధానాలతో రాష్ట్రాల ముఖ్యమంత్రులు తిరగబడే పరిస్థితి వస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలపై దేశవ్యాప్తంగా ఈనెల 13న ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. కరోనా నియంత్రణలో కేంద్రం ఘోరంగా విఫలమైందని విమర్శించారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా ఈనెల 11 నుంచి 17వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. కొత్త బిల్లుల విషయంలో తెలంగాణ సర్కార్ దూకుడుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రశ్నించే వారిపై బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: దేశంలో ఒక్కరోజే 75 వేల కేసులు-1133 మరణాలు