నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసం పోరాటం చేసిన ప్రముఖ ఉర్దూ కవి మగ్దూం మొహియుద్దీన్ జయంతి వేడుకలను సీపీఐ నాయకులు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. హిమయత్‌నగర్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
నిరంకుశ పాలన నుంచి విముక్తికై సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన వీరుడు మగ్దూం అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి గుర్తుచేశారు. ఆ పోరాటం ఫలితంగానే... నిజాం పాలన రద్దైందని తెలిపారు. వీరుల జీవితాలు నేటితరానికి స్ఫూర్తి అని... మగ్దూం ఆశయ సాధన కోసం సీపీఐ పార్టీ పని చేస్తోందని చాడ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: మగ్దూం మొహియుద్దీన్‌కు సీపీఎం నగర కమిటీ నివాళులు