ఆర్టికల్ 370 రద్దు పూర్తి రాజ్యాంగ విరుద్ధమన్నారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా. హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో కామ్రేడ్ ఇంద్రజిత్ గుప్తా శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరైన ఆయన... మోదీ ప్రభుత్వం జమ్ము కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిందని పేర్కొన్నారు. కశ్మీర్లో ఇంకా కర్ఫ్యూ వాతావరణమే కొనసాగుతోందని... ఇంటర్నెట్, టెలిఫోన్లు పనిచేయడం లేదని తెలిపారు. ప్రతిపక్ష పార్టీల నేతలు జమ్మూకశ్మీర్‌కు వెళ్తే విమానాశ్రయంలోనే అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. ఆర్టికల్ 370 ప్రకారం కశ్మీర్‌కు ఇచ్చిన హామీల అమలుపై మాట్లాడేందుకు మోదీ సిద్ధంగా లేరని విమర్శించారు.
ఇదీ చూడండి : ఇందూరు దవాఖానాలో దాహం తిప్పలు