క్విట్ ఇండియా ఉద్యమానికి విరుద్ధంగా కేంద్రంలో భాజపా పరిపాలనా కొనసాగిస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. గాంధీజిని కాల్చి చంపిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త గాడ్సేను... ఆర్ఎస్ఎస్, జనసంగ్, భాజపా రాజకీయ పార్టీలు ఖండించలేదని ఆయన పేర్కొన్నారు. అలాంటి భాజపా నాయకులు క్విట్ ఇండియా గురించి ప్రస్తావించడం హాస్యాస్పదం అన్నారు.
ఆగస్టు 15న స్వాత్రంత్య్ర దినోత్సవమైతే... ఆగస్టు 5న క్విట్ ఇండియాను అవమానించిన రోజుగా భావిస్తున్నామని నారాయణ తెలిపారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి... రాముని పేరుతో ఏక పాలన సాగిస్తున్నారని విమర్శించారు.
ఇదీ చూడండి: 'సీపీ కార్యాలయం ఎదుట యువకుడు ఆత్మహత్యాయత్నం'