దేశంలో గవర్నర్ వ్యవస్థ రాజ్యాంగ అధిపతిగా ఉండాలి తప్పా.. రాజకీయ పార్టీ కార్యకర్తలా ఉండకూడదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ధ్వజమెత్తారు. రాజస్థాన్ రాజకీయాలపై స్పందించిన ఆయన.. గవర్నర్ కల్రాజ్ మిశ్రా భాజపా కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
స్వయంగా ముఖ్యమంత్రే తన విశ్వాసం నిరూపించుకునేందుకు అవకాశం కోరితే.. ఇవ్వకుండా అడ్డుపడుతున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను భాజపా వైపు తిప్పుకునేందుకే ఈ ఆలస్యమని దుయ్యబట్టారు. గవర్నర్ తీరును సీపీఐ తీవ్రంగా ఖండిస్తోందని వ్యాఖ్యానించారు.
ఇదీచూడండి: రాజస్థాన్: అసెంబ్లీ నిర్వహణపై గహ్లోత్కు మళ్లీ చిక్కు