ETV Bharat / state

'కరోనా కట్టడికి ఏం చేయబోతున్నారో మోదీ చెప్పలేకపోతున్నారు' - cpi narayana latest news

బుద్ధుని జయంతిని పురస్కరించుకుని ప్రధాని చేసిన ప్రసంగంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు చేశారు. మోదీ ప్రసంగం సానుభూతి సంపాదించే పద్ధతుల్లో సాగిందని ఎద్దేవా చేశారు. కరోనా కట్టడికి ఏం చేయబోతున్నారో చెప్పలేకపోతున్నారంటూ వ్యాఖ్యానించారు.

మోదీ ప్రసంగంపై విమర్శలు చేసిన సీపీఐ నారాయణ

author img

By

Published : May 26, 2021, 5:57 PM IST

బుద్ధుని జయంతి సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన ప్రసంగం సానుభూతి సంపాదించే పద్ధతుల్లో ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎద్దేవా చేశారు. కరోనా నివారణకు ప్రధానమంత్రిగా ఏం చేశారో.. ఏం చేయబోతున్నారో మోదీ చెప్పలేకపోతున్నారని విమర్శించారు. పడకలు, ఆక్సిజన్‌ దొరక్క ప్రజలు చనిపోతుంటే ఏం చేస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు.

ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని నారాయణ డిమాండ్‌ చేశారు. అన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులను ప్రభుత్వ గొడుగు కిందకు తీసుకురావాలని కోరారు. కొవిడ్‌ బాధితులను కాపాడటంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

ఇదీ చూడండి: బుద్ధుని బోధనలు నేటికీ ఆచరణీయం: దలైలామా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.