ETV Bharat / state

ఆ చట్టం విషయంలో దొంగే దొంగ అన్నట్లుగా ఉంది : చాడ

నూతన విద్యుత్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడంపై భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించడం దొంగే దొంగ అన్నట్లుగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఆ చట్టానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమానికి సిద్ధం కావాలని సూచించారు.

cpi leader chada venkat reddy comment on bandi sanjay New Electricity Amendment Act
ఆ చట్టం విషయంలో దొంగే దొంగ అన్నట్లుగా ఉంది : చాడ
author img

By

Published : Sep 17, 2020, 2:31 PM IST

ఆ చట్టం విషయంలో దొంగే దొంగ అన్నట్లుగా ఉంది : చాడ

నూతన విద్యుత్ సవరణ చట్టం అసెంబ్లీలో తీర్మానం అసంబద్ధమైనదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ఆ చట్టం ఆమోదం పొందే ముందు తీర్మానం చేయడంలో భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించడం దొంగే దొంగ అన్నట్లుగా ఉందని చాడ ఎద్దేవా చేశారు.

విద్యుత్ సవరణ చట్టం అభిప్రాయ సేకరణ నిమిత్తం చాలా పార్టీలు తమతమ అభిప్రాయాలను వ్యక్తపరిచాయన్నారు. తెలంగాణ శాసనసభలో ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా తీర్మానం చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు. ఆ విద్యుత్ సవరణ చట్టం వలన రైతులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని పేర్కొన్నారు. ప్రజల యొక్క బాధలను దృష్టిలో పెట్టుకుని ఈ చట్టాన్ని సీపీఐ వ్యతిరేకిస్తుందన్నారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ ప్రజా ఉద్యమానికి సిద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి : 'ఇది కేవలం సైనిక చర్య వల్ల జరిగిన విలీనం కాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.