హైదరాబాద్ సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూం భవన్‌లో నిర్వహించిన తెలంగాణ అవతరణ వేడుకల్లో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నరేంద్రమోదీ మంత్రివర్గంలోని 56 మందిలో 52 మంది ధనవంతులే ఉన్నారని ఆయన విమర్శించారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా కేసీఆర్ కుట్ర చేస్తే ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారని ఎద్దేవా చేశారు. కమ్యూనిస్టులు ఏకమై దేశంలో మతోన్మాదానికి చరమ గీతం పాడాలని అన్నారు.
ఏకం కావాలి
ఎందరో అమర వీరుల పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. తెరాస పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ప్రజలు ఏకం కాకపోతే పోరాడి సాధించుకున్న రాష్ట్రం మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి : గాంధీ భవన్‌లో అవతరణ దినోత్సవ వేడుకలు