ETV Bharat / state

వరదలపై తక్షణమే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలి: చాడ

భవిష్యత్‌లో హైదరాబాద్‌ను కాపాడుకోవాలంటే తక్షణమే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి... చక్కటి ప్రణాళిక రూపొందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ భాగ్యనగరాన్ని.. అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని మాటలు చెప్పడం కాకుండా... చేతల్లో చేసి చూపించాలన్నారు.

cpi-chada-venkat-reddy-meet-ghmc-mayor-bonthu-ram-mohan-on-floods-in-hyderabad
వరదలపై తక్షణమే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలి: చాడ
author img

By

Published : Nov 3, 2020, 5:49 PM IST

అక్రమాలకు గురైన మూసి పరివాహక ప్రాంతాలతో పాటు... కబ్జాలకు గురైన చెరువుల పరిరక్షణ కోసం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆ పార్టీ నాయకులు నరసింహారావు, కూన సాంబశివరావు తదితరులతో కలిసి గ్రేటర్ హైదరాబాద్​ మేయర్ బొంతు రామ్మోహన్​ను కలిసి వినతి పత్రం అందించారు.

స్వలాభాల కోసం...

ఈ విషయంపై మేయర్‌ సానుకూలంగా స్పందించారని చాడ తెలిపారు. త్వరలోనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పినట్లు వెల్లడించారు. నగరంలో మూసి పరివాహక ప్రాంతం, చెరువులు ఆక్రమణలకు గురికావడం వల్లనే... మొన్న కురిసిన వర్షాలకు హైదరాబాద్​ అతలాకుతలమైందని చాడ పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు తమ సొంత ఆస్తులను పెంచుకోవడం కోసం... రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసి.. చెరువులు ఆక్రమించారంటూ ఆరోపించారు. తమ స్వలాభం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని మండిపడ్డారు.

ఇకనైనా ప్రభుత్వం స్పందించి సరైనా చర్యలు తీసుకోవాలని చాడ సూచించారు. భాగ్యనగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామన్న కేసీఆర్... చేతల్లో కూడా చేసి చూపించాలన్నారు. వరద బాధితులను ఆదుకోవాలని... లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: మానవ తప్పిదాలతోనే ప్రకృతి విలయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.