ప్రభుత్వం సూచించిన నియంత్రిత పంటల సాగు విధానం వల్ల సన్న వరిపంట వేసిన రైతులు తీవ్ర నష్టాలకు గురయ్యారని హైదరాబాద్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. సన్న వరి ధాన్యానికి క్వింటాలుకు 2500 రూపాయల మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
తెగుళ్ల బారిన పడి వందల ఎకరాల్లో పంటను దగ్ధం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలు, దోమపోటు కారణంగా పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు పరిహారం అందజేసి, ఆదుకోవాలని చాడ వెంకట్‌రెడ్డి కోరారు.