ప్రజా వ్యతిరేక బిల్లులను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంరించుకోవాలని సీపీఐ కేంద్ర కమిటీ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ నియంత లాగా పాలన చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన కేంద్రమే దానిని ఉల్లంఘిస్తోందని అందుకే ప్రజలు రాజ్యాంగ పరిరక్షణ కోసం ముందుకు వచ్చారని పేర్కొన్నారు.
కేంద్రం తీసుకొచ్చిన కార్మిక, రైతుల వ్యతిరేక బిల్లులను ఉపసంహరించుకోవాలని దేశవ్యాప్తంగా చేస్తున్న సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. రైతులను బానిసలుగా మార్చి, బడా పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చేందుకు మోదీ ఈ బిల్లులను తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ఆ బిల్లులను ఉపసంహరించుకోకపోతే భవిష్యత్తులో ఉద్యమం మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: సీఎం కేసీఆర్ వెంటనే స్పందించాలి: బండి