రాష్ట్రంలో సంప్రదాయ పీజీ కోర్సుల్లో ఈ విద్యా సంవత్సరం భారీగా సీట్లు మిగిలిపోయాయి. ఓయూ, కేయూ, తెలంగాణ, మహాత్మగాంధీ, శాతవాహన, తెలుగు యూనివర్సిటీల్లోని కోర్సుల భర్తీ కోసం నిర్వహించిన సీపీజెట్ రెండో విడత కౌన్సిలింగ్ సీట్లను శుక్రవారం కేటాయించారు.
రెండో విడతలో 2,938 మందికి సీట్లు కేటాయించినట్లు కన్వీనర్ కిషన్ వెల్లడించారు. ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ తదితర పీజీ కోర్సుల్లో 39,009 సీట్లు అందుబాటులో ఉండగా.. ఇంకా 11,785 సీట్లు మిగిలే ఉన్నాయి. ఈనెల 15లోగా విద్యార్థులకు కేటాయించిన కళాశాలల్లో టీసీ సమర్పించకపోతే సీటు రద్దవుతుందని కన్వీనర్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 'రాజకీయ దురుద్దేశంతోనే హైదరాబాద్ ర్యాంక్ తగ్గించారు'