హైదదాబాద్ నగరంలోని ఐటీ కారిడార్... నిత్యం వేలాదిగా జనం సంచరించే ప్రాంతం. ఇక్కడ చినుకు పడితే తలెత్తే ట్రాఫిక్ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. రోడ్లపై నీరు నిలిచి వాహనదారులు గంటల తరబడి వేచి చూడాల్సిందే. అలాంటి పరిస్థితి రాకుండా సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ ప్రత్యామ్నాయ మార్గాలను నగరవాసులకు సూచించారు. జీహెచ్ఎంసీ కమిషనర్, సిబ్బందితో నగరంలో ట్రాఫిక్ పరిస్థితిపై సమీక్షించారు. ప్రధానంగా నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ఆ మార్గాల్లో కాకుండా వేరే మార్గాలను ఆన్వేషించారు. గచ్చిబౌలి నుంచి జూబ్లీహిల్స్ వెళ్ళాల్సిన వారు బయోడైవర్సిటీ, ఖాజాగూడా, ఫిలింనగర్, కేబీఆర్ పార్క్ మీదుగా వెళ్లాలని సూచించారు. హైటెక్ సిటీ నుంచి జేఎన్టీయూ వెళ్లాల్సిన వారు హైటెక్స్, కొండాపూర్, అల్విన్ చౌరస్తా మీదుగా వెళ్లాలని అన్నారు. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్‌ను విడుదల చేసిన సీపీ, ట్రాఫిక్‌లో ఇరుక్కోకుండా ఈ మార్గాలను ఎంచుకోవాలని నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి : వర్షపు నీటితో నిండిపోయిన ఖైరతాబాద్ రైల్వే స్టేషన్