ETV Bharat / state

ఒక్కరికి శిక్ష పడితే- ఆ 100 మందిలో భయం పుడుతుంది : సీపీ కొత్తకోట శ్రీనివాస రెడ్డి

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 17, 2023, 9:43 PM IST

CP Srinivas Reddy Meeting With Officers : హైదరాబాద్‌లోని కమిషనరేట్‌లో ఉన్నతాధికారులు, పోలీస్ సిబ్బందితో సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు. కేసుల దర్యాప్తు వేగం పెంచాలని సూచించారు. ఒక్క నేరస్థుడికి శిక్ష పడితే, 100 మంది భయపడతారని సూచించారు. మరోవైపు డ్రగ్స్‌ రహిత తెలంగాణ ధ్యేయంగా టీఎస్‌ న్యాబ్‌ పని చేస్తుందని ఆ సంస్థ డైరెక్టర్ సందీప్ శాండిల్యా తెలిపారు.

CP Srinivas Reddy Meeting With Officers in Hyderabad
CP Srinivas Reddy Meeting With Officers

CP Srinivas Reddy Meeting With Officers in Hyderabad : ఒక్క నేరస్థుడికి శిక్ష పడితే నేరం చేయాలనుకునే 100 మందిలో భయం వస్తుందని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని కమిషనరేట్‌లో ఉన్నతాధికారులు, పోలీస్ సిబ్బందితో ఆయన సమావేశం అయ్యారు. పోలీస్ స్టేషన్‌కి వచ్చి ఫిర్యాదు చేసే వారితో గౌరవంగా వ్యవహరించాలని తెలిపారు. వారి ఫిర్యాదులపై పారదర్శకంగా విచారణ జరపించాలని సూచించారు.

CP Srinivas Reddy Instructions to Officers : భాగ్యనగరంలో ట్రాఫిక్ సమస్య తీర్చేందుకు కృషి చేయాలని సీపీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన ప్రణాళిల(Plan For Control Traffic in Hyderabad)కు సిద్దం చేయాలని ఆదేశించారు. మాదకద్రవ్యాలతో పాటు డ్రగ్స్‌ ఇతర నిషేధ వస్తువులు నగరంలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న కేసులు దర్యాప్తు వేగంగా చేసి, నిందితులకు శిక్ష పడేలా చేయాలని విజ్ఞాప్తి చేశారు.

డ్రగ్స్‌ ముఠాలను సహించేది లేదు - పబ్స్‌ యజమానులు జాగ్రత్త ఉండాలి : హైదరాబాద్‌ సీపీ వార్నింగ్

Kothakota Srinivas Reddy Meeting With Police Force : సైబర్‌ నేరాల దర్యాప్తులో దేశంలోనే హైదరాబాద్‌ మొదటి స్థానంలో ఉందని సీపీ హర్షం వ్యక్తం చేశారు. పోలీస్ వ్యవస్థ వద్ద ఉన్న అన్ని సదుపాయాలను వినియోగించుకుని దర్యాప్తు మరింత వేగంగా చేసి రికవరీ రేటును పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పోలీస్ ఉన్నతాధికారులు, కమిషనరేట్ పరిధిలోని ఇన్పెక్టర్లు పాల్గొన్నారు.

NAB Director Sandeep Shandilya on Drug Mafia : డ్రగ్స్‌ రహిత తెలంగాణ ధ్యేయంగా టీఎస్‌ న్యాబ్ వ్యవస్థ(TS NAB Director Sandeep Sandlya) పని చేస్తుందని డైరెక్టర్ సందీప్ శాండిల్యా వివరించారు. ఈ మేరకు ఈ వ్యవస్థపై ఓ ప్రకటన విడుదల చేశారు. తాను ఈ నెల 12న టీఎస్ న్యాబ్‌ డైరెక్టర్‌గా నియామకం పొందారని గుర్తు చేశారు. డ్రగ్స్‌ నివారణ ప్రణాళికపై, కట్టడికి చేసిన కృషి గురించి సీఎం రేవంత్‌ రెడ్డితో 2 గంటలు చర్చించామని అన్నారు. న్యాబ్‌ను గ్రేహౌండ్స్, ఆక్టోపస్ సంస్థల వలే మారాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో పలువురు ఐపీఎస్‌ అధికారులు బదిలీ - హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి

Sandeep Shandilya Advice to Control Drugs in Telangana : రాష్ట్రంలో ఉన్న విద్యాసంస్థలు, ఐటీ, ఫిల్మ్ ఇండస్ట్రీపై దృష్టి సారించామని న్యాబ్‌ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్యా తెలిపారు. బార్లు, పబ్‌లు, రేవ్ పార్టీలు, రిసార్టులపై ప్రత్యేక దృష్టి పెట్టామని పేర్కొన్నారు. పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా తల్లిదండ్రులు బాధ్యత వహించాలని సూచించారు. డ్రగ్స్‌ నివారణకు ప్రతి ఒక్కరు పోరాటం చేయాలని అన్నారు. మాదకద్రవ్యాలపై ఏదైనా సమాచారం లభిస్తే 8712671111 నంబర్‌కు ఫోన్‌ చేసి చెప్పాలని కోరారు.

యాంటీ క్యాన్సర్ డ్రగ్స్​పై డీసీఏ ఉక్కుపాదం - భారీ మొత్తంలో నకిలీ మందులు స్వాధీనం

హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్యాకు అస్వస్థత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.