దేశంలోనే ఎక్కడా లేని విధంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రమాదాలను అరికట్టేందుకు వినూత్నరీతిలో ఏడు చోట్ల రోడ్డు భద్రత తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశామని సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ తనిఖీ కేంద్రాలు 24 గంటలు పని చేస్తాయని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించేందుకు ఇక్రిశాట్ వద్ద రోడ్డు భద్రతా తనిఖీ కేంద్రాన్ని సీపీ శుక్రవారం ప్రారంభించారు.
ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదని సీపీ అన్నారు. వాహనచోదకులకు హెల్మెట్ గురించి అవగాహన కల్పించి... లేని వారితో కొనుగోలు చేయించి స్వయంగా వాహనదారులకు ధరింపజేశారు. మందు తాగి రోడ్డు మీదకు రాకూడదని... వచ్చినా ఆటోలో లేదా క్యాబ్లో వెళ్లాలని సూచించారు. ఓ వాహనదారుడు పాడిన పాట వాహనచోదకులకు ఎంతగానో అవగాహన కల్పించేలా ఉండటంతో హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: అర్థం చేసుకుందాం.. బాధ్యతగా వ్యవహరిద్దాం!