ETV Bharat / state

CP SAJJANAR: 'అవయవదానంపై అపోహలు తొలగిపోవాలి' - cyberabad CP Sajjanar latest news

అవయవ దానంపై ఉన్న అపోహలు తొలగిపోవాలని సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ పేర్కొన్నారు. అవయవ దానం చేసిన వారంతా దేవుళ్లతో సమానమని అన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అవయవ దానం చేసిన వారి కుటుంబసభ్యులు, రోడ్డు ప్రమాదాల్లో ఇతరులను కాపాడిన వారిని సజ్జనార్ సత్కరించారు.

CP SAJJANAR
CP SAJJANAR
author img

By

Published : Aug 9, 2021, 9:57 PM IST

అవయవ దానం చేసిన వారంతా దేవుళ్లతో సమానమని సైబరాబాద్ సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 82 మంది అవయవ దానం చేశారని తెలిపారు. 308 మంది పునర్జన్మ పొందారని వెల్లడించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అవయవ దానం చేసిన వారి కుటుంబసభ్యులు, రోడ్డు ప్రమాదాల్లో ఇతరులను కాపాడిన వారిని సజ్జనార్ సత్కరించారు.

ఈ సందర్భంగా అవయవ దానంపై ఉన్న అపోహలు తొలగిపోవాలని సీపీ సజ్జనార్​ పేర్కొన్నారు. చదువుకున్న వారే ఎక్కువగా ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అవయవ దానం ద్వారా మరొకరికి పునర్జన్మ ప్రసాదించవద్దని అన్నారు.

మరోవైపు రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఎక్కడో ఓ చోట నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని సీపీ పేర్కొన్నారు. ప్రమాదాల్లో గాయపడిన వారిని ఇతరులు పట్టించుకోకపోవడం వల్ల ఎంతో మంది తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని కాపాడితే.. పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని సీపీ స్పష్టం చేశారు. ఆస్పత్రుల్లోనూ పేషెంట్​ బిల్లు కట్టమని వేధించరని తెలిపారు.

ఈ సందర్భంగా సైబరాబాద్​లో ట్రాఫిక్ మేనేజ్​మెంట్​పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని సజ్జనార్​ వివరించారు. ఈ ఏడాది 419 హిట్ అండ్ రన్ కేసులు నమోదైతే.. అందులో 209 కేసులు ఛేదించినట్లు తెలిపారు. రోడ్డుపైకి వచ్చేటప్పుడు ప్రతి ఒక్క వాహనదారుడు తమకు ఓ కుటుంబం ఉందని గుర్తు పెట్టుకోవాలని సూచించారు.

అపోహలు తొలగిపోవాలి..

అవయవదానం ద్వారా చనిపోయిన తర్వాత కూడా మళ్లీ జన్మించే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం 83 మంది అవయవదానం చేశారు. ఈ అవయవదానం పట్ల చాలా మందిలో అపోహలు ఉన్నాయి. అవి తొలగిపోవాలి. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసులకు సమాచారం ఇస్తే నేరం తమపై పడుతుందనే భావనతో చాలా మంది గాయపడిన వారిని చూసీచూడనట్లుగా వెళ్తుంటారు. యాక్సిడెంట్​ అయినప్పుడు క్షతగాత్రులను ఆస్పత్రుల్లో చేరిస్తే .. చేర్పించిన వారికి ఏ ఇబ్బంది ఉండదు.-సజ్జనార్​, సైబరాబాద్​ సీపీ

CP SAJJANAR: 'అవయవదానంపై అపోహలు తొలగిపోవాలి'

ఇదీ చూడండి: 'మరణిస్తూ.. మరొకరికి ఆయువుపోసే అవకాశం అందరికీ రాదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.